Advertisement
ఆగ్నేయ ఇంగ్లాండ్ లో 16వ శతాబ్దం చివరి దశ నుండే క్రికెట్ కు దాని చరిత్ర ఉంది. ఇది 18వ శతాబ్దంలో దేశ జాతీయ క్రీడగా మారింది. ఆ రోజుల్లో వారికి అప్పుడు అవైలబుల్ లో ఉండే వస్తువులను వాడుతూ ఉండేవారు. కానీ 18వ శతాబ్దం తర్వాత టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగు ఎంపిక చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ లో సాంప్రదాయ ఫార్మాట్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఈ ఫార్మాట్ ను పాటిస్తారు. మరి ఆ తెల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారో ఓసారి తెలుసుకుందాం..?
Advertisement
1. శాస్త్రీయ కారణం
టెస్ట్ క్రికెట్ ఆడే టప్పుడు క్రీడాకారులు రోజూ ఎనిమిది గంటలు మైదానంలో ఉండవలసి వస్తుంది. అయితే ఈ క్రికెట్ ను మొదట వేసవి క్రీడగా ప్రవేశపెట్టారు. దీంతో తెల్లని దుస్తులు వేడిని చాలా ప్రతిబింబిస్తాయి. ఇతర దుస్తుల కంటే ఈ తెల్లని రంగు దుస్తులు వేసవికాలంలో సౌకర్యవంతంగా ఉంటాయి. దీనివల్ల క్రీడాకారుల్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది. వడదెబ్బ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
Advertisement
2. సంప్రదాయ ప్రభావం
ఇందులో సాంప్రదాయ అంశం కూడా ఉందని తెలుస్తోంది. తెల్లని బ్రిటిష్ వారు రాయల్టీకి చిన్నంగా భావించారు. అందుకే శ్వేత జాతీయులకు ఇది ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇది క్రీడాకారులందరిలో సమానత్వ భావాన్ని పెంపొందిస్తుందని ఈ దుస్తులను ఎంచుకున్నారు.
3. క్రికెట్ సౌకర్యం
అలాగే శ్వేతజాతీయులు దీన్ని లాజికల్ గా కూడా తీసుకుంటారు. టెస్ట్ క్రికెట్ ఆడే టప్పుడు ఎరుపురంగు బంతిని ఉపయోగిస్తారు. అయితే ఫీల్డులో ఎర్రని బంతిని తెల్లని బ్యాక్ డ్రాప్ లో గుర్తించడం చాలా సులభం. అందువల్ల ఇది లాజికల్ గా ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సంవత్సరాల తరబడి ఆవిష్కరణలు అమలులో ఉన్నాయి. దీనికి కట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు వీటినే పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతున్నాయి.
ALSO READ;
ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!