Advertisement
సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20న జన్మించిన 83 ఏళ్ళ కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:25 గంటలకు కన్నుమూశారు. కృష్ణంరాజు 183 చిత్రాలకు పైగా నటించారు. కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగల్తూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రాజకీయ ప్రముఖులకు, అభిమానులకు భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement
వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపించారు. మొత్తంగా 50 రకాల నాన్ వెజ్ వెరైటీలు చేయించి ఆ జనాభాని తృప్తిపరిచి పంపించారు. రాజ కుటుంబానికి చెందిన కృష్ణంరాజు తనని కలపడానికి ఎవ్వరు వచ్చినా వారికి భోజనం పెట్టనిదే తిరిగి పంపేవారు కాదు. ప్రభాస్ కూడా తన వద్దకు వచ్చిన మీడియా మిత్రులకు గాని, స్నేహితులకు గాని అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారని ఇండస్ట్రీ సభ్యులు అంతా చెప్పుకుంటారు. కృష్ణం రాజుగారు ఇలా తమ ఇంటికి వచ్చినవారికి భోజనం పెట్టి పంపివ్వడానికి వెనుక ఒక చిన్న కథ ఉంది. కృష్ణంరాజు కెరీర్ ప్రారంభంలో జర్నలిస్టుగా పనిచేసేవారు. ఆ తరువాత నటన మీద ఉన్న ఆసక్తి వల్ల నటుడిగా మారి చిన్నచిన్న పాత్రలు చేయడంం మొదలుపెట్టారు.
అయితే రాజ కుటుంబానికి చెందినవారు కావడంతో సినిమాలలో నటించడం కృష్ణంరాజు కుటుంబ సభ్యులకుు ఇష్టం లేకపోవడంతో తన ఖర్చులకు ఇంట్లో వారిని కూడా డబ్బులు అడిగే వారు కాదు. ఒకానొక సమయంలో భోజనం చేయడానికి కూడా కృష్ణంరాజు వద్ద డబ్బులు లేకపోవడంతో దాదాపు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి తన స్నేహితుడిని అప్పు అడిగాడు. కృష్ణంరాజు మొహమాటాన్ని గుర్తించి అతని స్నేహితుడు భోజనం పెట్టి మరి డబ్బులు ఇచ్చారట. తాను పడిన కష్టాన్ని మరిచిపోని కృష్ణంరాజు తనను కలవడానికి ఇంటికి ఎవరు వచ్చినా కడుపునిండా భోజనం పెట్టి గాని పంపేవారు కాదని సమాచారం.
Read also: నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!