Advertisement
అలనాడు సినిమా ఇండస్ట్రీని తన నటనతో ఒక ఊపు ఊపిన హీరో సీనియర్ ఎన్టీఆర్.. ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే అభిమానులు బ్రహ్మరథం పట్టేవారు.. ఆయన్ని హీరో లాగా కాకుండా ఒక దేవుడిలా కొలిచారు తెలుగు ప్రజలు.. ఆ విధంగా ఎన్టీఆర్ సినిమారంగంలో తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకొని, రాజకీయంలో కూడా అరంగేట్రం చేసి మరపురాని నాయకుడిగా ఎదిగారు. పాలనలో ఎన్నో పథకాలు తీసుకువచ్చి ప్రజలకు దేవుడు అయ్యారు.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి ప్రజలకు మంచి పాలన అందించిన నాయకుడయ్యారు.. ఈ విధంగా ఎన్టీఆర్ పేదల పక్షాన నిలబడే ముఖ్యమంత్రిగా గుర్తింపు సాధించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇవి కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు ?
అంతే కాకుండా ఎన్టీఆర్ ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారు.. అది సినిమా అయినా రాజకీయమైనా తన వ్యక్తిగత జీవితం అయినా సరే ఒక క్రమశిక్షణ, సమయపాలన అనేది తప్పనిసరిగా పాటించేవారు.. సినిమా షూటింగ్ సమయంలో అయితే సీనియర్ ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటలకు మొదలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక సెషన్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరొక సెషన్ షూటింగ్ లో పాల్గొనేవారట. ఈ విధంగా ఆయన ప్రతిదీ సమయపాలనతోనే చేసేవారని చెబుతుంటారు. ఈ విధంగా ఆయన సినిమాలే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా చాలా ప్రత్యేకత ఉండేది.. ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే నిద్రలేచేవారట ఎన్టీఆర్..
Advertisement
ఇవి కూడా చదవండి: అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్..గుజరాతీ గులామ్ అంటూ కేటీఆర్ ఫైర్
ఆ తర్వాత వ్యాయామం చేసి, స్నానమాచరించి 24 ఇడ్లిలు తినేవారట, మరి ఆ ఇడ్లీలు కూడా చిన్నగా ఉన్నాయి అనుకునేరు, అవి ఇప్పుడున్న వాటికంటే డబల్ ఉండేవట, ఇలా కొద్ది కాలం ఇడ్లీలు తిన్న ఆయన ఆ తర్వాత అది మానేసి ఉదయాన్నే భోజనం చేసేవారట. భోజనం లో కచ్చితంగా మాంసాహారం ఉండేవిధంగా చూసుకునే వారని, అంతే కాకుండా ప్రతి రోజు 2 లీటర్ల బాదం పాలు కూడా తాగే వారట. అలాగే ఎన్టీఆర్ చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాలనిపిస్తే 30 నుండి 40 బజ్జీలను సునాయాసంగా లాగించే వారట. ఈ విధంగా ఆయన ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకమైన అభిరుచిని కలిగి ఉండేవారని ఆయనతో కలిసి తిరిగిన కొంతమంది చెప్పేవారు.
Advertisement
ALSO READ: