Advertisement
నయనతార, ఆమె భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్, సరోగసి పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇలా సరోగసి పద్ధతిలో పిల్లలను కనటం అనేది వారికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెట్టింది. పెళ్లయిన నాలుగు నెలలకే వారు ఇలా సరోగసి ప్రాసెస్ లో పిల్లల్ని కనటం వివాదంగా మారింది. దీంతో వీరిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమనీయన్ స్పందిస్తూ వారిద్దరిని ఈ వివాదానికి సంబంధించిన వివరణ కోరినట్లు తెలిపారు.
Advertisement
అంతేకాకుండా వివాదం పై విచారణ చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఒకవేళ ఇందులో దోషిగా తేలితే, నయనతారకు 7ఏళ్లు జైలు శిక్ష తప్పదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రముఖ వేణు స్వామి గురించి మనకు తెలిసిందే. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరుగుతాయని నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారు అని చెప్పిందే నిజమైంది.
Advertisement
అదే విధంగా ప్రభాస్ విషయంలోనూ ఆయన చెప్పిందే జరిగింది. ఇక నయనతార విషయంలో కూడా అప్పుడే ఆయన కొన్ని విషయాలు చెప్పారు. నయనతారకు పెళ్లి అచ్చి రాదని, పెళ్లి జరిగినప్పటినుండి ఆమె ఏదో ఒక చిక్కుల్లో పడుతుందని ఆమె ఆ బంధాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేదని, కచ్చితంగా విడాకుల వరకు వెళుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే నయనతార పెళ్లి జరిగినప్పటినుండి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. త్వరలోనే ఆమె విడాకులు కూడా తీసుకుంటుంది కావచ్చు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Kantara Movie Review : “కంతారా” రివ్యూ..RRR, KGFను మించిపోయిందిగా !