Advertisement
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి.. గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఎల్లో మీడియాను ట్విట్టర్ వేదికగా ఏకిపారేస్తూ ఉంటారు విజయ్ సాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈనాడు అధినేత రామోజీరావు పై వరసగా ఫీట్లు పెడుతూ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నారు విజయసాయిరెడ్డి. విశాఖలో భూములు కబ్జా చేశాడని విజయసాయిరెడ్డి పై ఇటీవల ఈనాడు పేపర్లో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే ఆ ఎపిసోడ్ నుంచి ఈనాడును టార్గెట్ చేశారు విజయ సాయి రెడ్డి.
Advertisement
రామూ…ఫిలింసిటీ కొండపైఉన్న నీఇంట్లో బాగోతాలు తెలుసు. ఫిలింసిటీలో ఎన్ని కొండల్ని పిండి చేశావు? చెరువులను పుడ్చావు. 2500 ఎకరాల్లో ఎన్ని ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఆక్రమించావు. నీకన్నా గజదొంగ ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా డ్రామోజీ? పెద్దమనిషిలా కనిపించే నీ మోసపు అంతరంగం అందరికీ ఎరుకే అంటూ సాయిరెడ్డి మండిపడ్డారు. 1970లో అప్పటి రాష్ట్ర హోంమంత్రి చిట్ ఫండ్ బిల్లును అసెంబ్లీలో పెట్టకముందే రామోజీ తన ప్రయోజనాలకు అనుగుణంగా దానిలో మార్పులు, చేర్పులు చేయించాడు. దీనిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారులు, చిన్న బ్యాంకుల ప్రమోటర్లని అరెస్టు చేయించాడు. రాము దుర్మార్గాలకు పరాకాష్ట ఇది అని విమర్శలు చేశారు.
Advertisement
నకిలీ కమ్యూనిస్ట్ రాము”ఈనాడు” ఒక క్రూరుడు. ఉద్యోగులని మనుషుల్లా కాకుండా జంతువులుగా భావిస్తాడు. తార్కిక, సహేతుకమైన విమర్శ కూడా భరించలేడు. తన కులం కాని ఉద్యోగులపై “ఈనాడు” నిఘాపెట్టి తలపై కనిపించని కత్తి వేలాడదీసి వారిని మానసికంగా హింసించే సైకో అని అగ్రహించారు. వేజ్ బోర్డు సిఫార్సులను ఈనాడు రామోజీ తిరస్కరిస్తే ఉద్యోగుల సమ్మెతో 23 రోజులు పత్రిక ప్రచురణ ఆగింది.1991లో సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా లొసుగులను అడ్డుపెట్టుకొని15 ఏళ్లు కోటి రూపాయలు చెల్లించకుండా వాయిదా వేసిన రాము ఉద్యోగులను దోచుకోవడంలో అందెవేసిన చేయి అని అగ్రహించారు.
రాము గురించి అయన రెండవ కుమారుడు సుమన్ అన్న మాటలు విందామని మరో ట్వీట్ చేశారు సాయిరెడ్డి. “బావిలో ఎన్ని నీళ్లు ఉన్నా అవి ఉప్పగా ఉంటే ఎవరికి ఉపయోగం. ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు. మంచి తండ్రి కాకపోవచ్చు. కానీ నాకు ఆయనకు కొడుకుగా పుట్టే అర్హత లేదు” అంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. రాముకి ఎవరిపైనా ప్రేమ ఉండదు. తనను తాను ప్రేమించుకునే రకం. డబ్బు, కీర్తి, అహంతృప్తి తప్ప మరి దేనిమీద గురిలేదు. కన్నకొడుకైనా, తల్లి, భార్య అయినా తన ఆస్తుల తర్వాతే! అంటూ ఈ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు సాయిరెడ్డి.
Read Also : ‘గాడ్ ఫాదర్’ లో సత్యదేవ్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా!
రాము గురించి అయన రెండవ కుమారుడు సుమన్ అన్న మాటలు విందాం: "బావిలో ఎన్ని నీళ్లు ఉన్నా అవి ఉప్పగా ఉంటే ఎవరికి ఉపయోగం. ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు. మంచి తండ్రి కాకపోవచ్చు. కానీ నాకు ఆయనకు కొడుకుగా పుట్టే అర్హత లేదు".
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 16, 2022