Advertisement
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏం చేసినా.. దానికి వెనుక పరామర్థం ఉంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే.. గత వారం సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు మూలాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన కేసీఆర్, ఆ కార్యక్రమం అనంతరం అటు నుంచి అటే ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారం పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారు.
Advertisement
మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ దాదాపు మూడు రోజుల నుంచి స్వల్ప అస్వస్థత తో ఉన్నట్లు సమాచారం. దీంతో తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులను ఇంటికి పిలిపించుకుని కేసీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.
Advertisement
మరో రెండు, మూడు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నతాధికారులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసిఆర్ ఆదేశించారు. దీంతో సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో అధికారులతో రాష్ట్రానికి సంబంధించి పాలనాపరమైన అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
READ ALSO : రాజకీయాలకు మంత్రి రోజా గుడ్ బై ?