Advertisement
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబుకుు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక అమ్మాయిలు అయితే మహేష్ బాబు అంటే పడి చచ్చిపోతారు. బాల నటుడిగా వెండితెరపై అడుగుపెట్టిన మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈయన నటించిన సినిమాలలో ఒకటి అర తప్ప అన్ని సూపర్ హిట్ సినిమాలే. మరికొన్ని సినిమాలు ఆయన ముందుకు వచ్చినా.. వాటిని వద్దనుకున్నాడు. అలా మహేష్ బాబు వదులుకున్న సినిమాలు తర్వాత సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు ఇవే..!!
1) ఇడియట్: ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ రవితేజ కంటే ముందే నలుగురు హీరోలను సంప్రదించాడు. అందులో మహేష్ బాబు కూడా ఒకరు. అయితే అలాంటి కథలో ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయలేరని ఆ సినిమాను మహేష్ బాబు రిజెక్ట్ చేశారట.
2) గజిని: తమిళ్, తెలుగులో దాదాపు ఏడుగురు హీరోల చుట్టూ తిరిగిన కథ గజిని. అందులో మహేష్ బాబు కూడా ఒకరు. అయితే ఆ క్యారెక్టర్ తాను చేయలేనని స్వారీ అని చెప్పారట.
3) యమలీల: ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల స్టోరీని ముందుగా సూపర్ స్టార్ కృష్ణకు వినిపించారట. ఈ కథ విని ఇంప్రెస్ అయిన కృష్ణ ఈ సినిమాతో మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు. కానీ మహేష్ బాబు చదువుని డిస్టర్బ్ చేయకూడదని తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.
4) గ్యాంగ్ లీడర్: నాని నటించిన ఈ సినిమాను విక్రమ్ ముందుగా మహేష్ కి చెప్పారట. అయితే ఆయన సున్నితంగా వద్దని చెప్పారట.
Advertisement
5) పుష్ప: ఈ సినిమాలో కూడా సుకుమార్ మహేష్ ను అడిగితే ఆయన నో చెప్పారట. దీంతో ఈ సినిమా అల్లు అర్జున్ తో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.
6) రుద్రమదేవి: ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో మొదట మహేష్ బాబును అడిగారట. కానీ ఏవో కారణాల రిత్యా మహేష్ నుండి ఈ క్యారెక్టర్ చేదారిందట.
7) నువ్వే కావాలి: స్రవంతి రవి కిషోర్ అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మహేష్ బాబుని నువ్వే కావాలి సినిమాకి హీరోగా అడిగారట. ఆ సినిమా ఒరిజినల్ వర్షం సిడిని మహేష్ బాబుకిి పంపారట. కానీ మహేష్ బాబు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తరుణ్ తో చేశారు.
8) ఏం మాయ చేసావే: గౌతమ్ మీనన్ తోలుత హీరోగా మహేష్ బాబును అనుకున్నాడట. అనివార్య కారణాల వల్ల ఇందులో మహేష్ నటించలేకపోయాడు. ఈ సినిమా కాస్త నాగచైతన్య చేతికి చిక్కి బంపర్ హిట్ గా నిలిచింది.
9) ఖైదీ నెంబర్ 150: కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ కత్తి ని తెలుగులో రీమేక్ చేయాలని దర్శకుడు మురుగదాస్ అనుకున్నాడు. అందుకోసం మహేష్ బాబు ని అడిగాడట. తాను నో చెప్పడంతో ఆగిపోయాడట. అదే స్టోరీ తో మెగాస్టార్ చిరంజీవి రీయంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.
10) అ ఆ: త్రివిక్రమ్ ఈ సినిమాని మహేష్ తో చేయాలని స్టోరీ రాసుకున్నాడట. ఈ స్టోరీ మహేష్ బాబుకి నచ్చింది కానీ డేట్స్ కుదరక వదులుకోవాల్సి వచ్చింది.
Read also: UNSTOPPABLE SEASON 2 కి పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వచ్చే 10 గెస్ట్ లు వీరే ..!