Advertisement
బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. భారత స్వాతంత్య్రం రోజున మోడీ తన ప్రసంగంలో మహిళల గౌరవాన్ని తగ్గించే పని ఏదీ చేయనని, మహిళల పట్ల మన ఆలోచన తీరు మారాలంటూ గొప్పగా మాట్లాడారని గుర్తు చేశారు. కానీ, బిల్కిస్ బానో కేసు నిందితులకు విధించిన జీవిత ఖైదు శిక్ష పూర్తిగా అనుభవించక ముందే విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు.
Advertisement
పైగా సత్ప్రవర్తన కారణంగానే విడుదల చేశామంటూ సమర్ధించుకోవడం ఏంటంటూ నిలదీశారు రాహుల్ గాంధీ. ఈ బిల్కిస్ బానో కేసు నిందితులు పాల్పడ్డ నేరాన్ని సీబీఐ, ప్రత్యేక కోర్టు సైతం క్షమింపరాని ఘోరమైన నేరంగా అభివర్ణిస్తే కేవలం 15 ఏళ్లు పూర్తికాగానే ముందస్తుగా విడుదల చేయడం సబబేనా అని మోడీపై విమర్శల వర్షం కురింపించారు.
Advertisement
ఈ కేసులో రే@@స్టుల విడుదల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా తొందరపడ్డాయని నివేదిక వెల్లడించింది. తాజాగా ఈ నివేదికపై స్పందించిన రాహుల్ ఈ విధంగా ధ్వజమెత్తారు. మహిళలను గౌరవించాలంటూనే మోడీ మృగాళ్లకు సానుకూలంగా వున్నారని అన్నారు. మహిళలను ప్రధాని తీవ్రంగా మోసం చేశారని ఫైరయ్యారు.
బిల్కిస్ బానో అ###రం కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం అగస్టులో విడుదల చేసింది. వారు విడుదలైన వెంటనే సన్మానం కూడా జరిగింది. నిందితులను విడుదల చేయవద్దంటూ సీబీఐ తన నివేదికలో పేర్కొన్నా కేంద్రం దాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: పవన్ తో చంద్రబాబు.. వైసీపీకి దడ మొదలైందా?