Advertisement
భార్యాభర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామి, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకు, భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి, భర్త భరోసా కావాలి. భారం కాకూడదు. భార్య, భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండటం కాదు, కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. భర్తలు తమ భార్య మాట అస్సలు వినరు. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కుతారు. అలాంటి భర్తలను భార్య ఎలా మార్చుకోవాలి. వారి దారిలోకి ఎలా తెచ్చుకోవాలి. అనే విషయాలు తెలుసుకుందాం.
Advertisement
Read also: నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!
# భర్త తినేటప్పుడు ఏ సమస్యలు చెప్పకూడదు:
భర్త ఆహారం తినేటప్పుడు భార్య ఇంటి సమస్యలు, ఇతర గొడవల గురించి ప్రస్తావిస్తూ చెప్పరాదు. ఇలా చెప్పడం వల్ల ఆయన తినాలి అనుకున్న దానికి తక్కువగా తిని ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భర్తకు రుచికరమైన ఆహారం వండి పెట్టాలి. దీనివల్ల భర్త భార్యకు సగం లొంగిపోతాడు.
Advertisement
# భర్త వ్యక్తిగత విషయాలు:
భర్త యొక్క వ్యక్తిగత విషయాలు భార్య ఎవరి వద్ద కూడా ప్రస్తావించకూడదు. అలాగే వారి మధ్య ఉన్న దాంపత్య రహస్యాలు కూడా వెల్లడించరాదు. అలాంటి సమయంలోనే భర్తకు భార్యపై నమ్మకం ఏర్పడుతుంది. దీనివల్ల భర్త మీరు అడగకముందే ఏ విషయం అయినా మీతో షేర్ చేసుకుంటాడు.
# నా భర్త లొంగి ఉండాలి:
కొంతమంది భార్యలు వారి యొక్క భర్త తన వద్ద లొంగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది అనివార్య పనులు చేసి భర్తను వారి దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటారు. కానీ అది తప్పు, భార్యలు గర్వంతో తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేయరాదు.
# భర్త మనస్సు గ్రహించాలి:
ప్రతి భార్య ఓ తల్లిలా భర్త మనసును గ్రహించాలి. తన మనసులో ఉండే కోరికలు బాధ్యులను గుర్తించి దానికి తగినట్టుగా మెదులుకోవాలి.