Advertisement
మనం సినిమా కి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకుంటాం.. ఆ టికెట్ ద్వారానే ఆ సినిమా వాళ్ళకి డబ్బులు వస్తాయి.. ప్రస్తుతం తెలుగు ఛానల్ లలో చూసుకుంటే అనేక సీరియల్స్ ఉన్నాయి. ఎంతో మంది నటిస్తూ ఉంటారు.. మరి సీరియల్స్ కు ఎలాంటి టికెట్స్ ఉండవు. మరి వీరికి డబ్బులు ఎలా వస్తాయి అనే విషయం చూద్దాం.. ఒక సీరియల్ కనీసం 30 నిమిషాల స్లాట్ అనుకుంటే అందులో ప్లే అయ్యేది 20 నిమిషాలు..
Advertisement
also read: ప్రమాదంలో టీమిండియా ఆల్ రౌండర్ కెరీర్
మరో పది నిమిషాలు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ యాడ్స్ ప్లే చేస్తారు. సీరియల్స్ కు మేజర్ రెవెన్యూ వచ్చేది యాడ్స్ మీదనే.. ఎక్కువ టిఆర్పీ ఉన్న సీరియల్స్ కు పది నిమిషాల గ్యాప్ లో వచ్చే యాడ్స్ పై ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షల పైన.. ఈ అమౌంట్ లో మూడు లక్షలు చానల్స్ కి, రెండు లక్షల రూపాయల సీరియల్ ప్రొడ్యూసర్లకు వెళ్తాయి. ఈ లెక్కన వారంలో ఐదు ఎపిసోడ్లు అంటే వచ్చే మొత్తం (5*200000=10,00000) 10 లక్షల రూపాయలు. ఇందులో నటీనటులకు ఇవ్వాల్సిన మొత్తం కూడా ప్రొడ్యూసర్లే చెల్లించాలి.
Advertisement
ఖర్చులు మొత్తం తీసేసిన చాలా పాపులర్ అయిన సీరియల్స్ అయితే ఎపిసోడ్ కి 4 నుంచి 5 లక్షల వరకు వారంలో రెవెన్యూ వస్తుంది. సీరియల్స్ లోనే సందర్భానుసారం జువెలరీ, సారీస్ కొన్ని కంపెనీలకు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అమౌంట్ కూడా ప్రొడ్యూసర్ కే వస్తుంది. దీనికి తోడు గా టీవీ లో ప్లే అయిన సీరియల్, వీడియోస్ ను యూట్యూబ్లో పెట్టినప్పుడు అక్కడ వచ్చే రెవెన్యూ కూడా టీవీ యాజమాన్యానికి ప్రొడ్యూసర్ కి షేర్ ఉంటుంది.
also read: