Advertisement
తెలుగు ఇండస్ట్రీలో అల వైకుంఠపురం సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు జయరామ్.. ఆయన అప్పటికే కమల్ హాసన్ పంచతంత్రం, భాగమతి, తుపాకీ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. అయినా ఆయనకు అల వైకుంఠ పురం సినిమా తోనే మంచి పేరు వచ్చింది..
ఆయన తెలుగులోనే కాకుండా తమిళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కోవడనే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నారు.
ALSO READ:చత్రపతి సినిమాలోని సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..?
Advertisement
ఆ తర్వాత తమిళ మూవీస్ లో సైడ్ హీరోగా కమెడియన్ గా రాణిస్తూన్నారు.. అయితే జయరాం నటనలోకి రాకముందే మిమిక్రీ ఆర్టిస్టు కావడం సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతో ఉపయోగపడింది.. ఇలా దశాబ్దకాలం పాటు నటనతో అలరిస్తున్న జయరామ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇంతటి ప్రముఖ నటుడైనప్పటికి ఆయన భార్య గురించి మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. ఆవిడ పేరు పార్వతి ఆమె కూడా ఒకప్పటి మలయాళం టాప్ హీరోయిన్..
70కి పైగా సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.1992 టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో వీరి మధ్యలో లవ్ పుట్టింది. అది పెళ్లి వరకు వెళ్ళింది.. వివాహమైన తర్వాత పార్వతి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు కాళిదాస్, ఆయన సినిమాల్లో హీరోగా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన జయరామ్ తనయుడు చిన్నతనంలోనే జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం..
Advertisement
ALSO READ: హీరో బాలకృష్ణ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..? వసుంధర ఎవరి కూతురంటే..?