Advertisement
హిందూ శాస్త్రం ప్రకారం మన పెద్దలు ఎన్నో నియమాలు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొన్ని పనులు చేసినప్పుడు కచ్చితంగా స్నానం చేయాలి అని చెబుతారు. అయితే కొన్ని పనులు చేస్తే మనం ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఏదైనా శుభకార్యాలు లేదా వివాహాలు జరిగినప్పుడు మనం ఆ కార్యక్రమాలకు హాజరు అవుతాము. సమయం లేకపోతే ఆ కార్యక్రమాలకు వెళ్లలేం. కానీ ఎవరైనా మరణిస్తే… మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే.. ఆ అంతక్రియలు అయిన అనంతరం మనం ఖచ్చితంగా స్నానం చేయాలి. మరణించిన వారి శరీరంలో బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉండదు. అందుకే వారి వద్దకు వెళ్లినప్పుడు..ఆ బ్యాక్టీరియా కారణంగా చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.
Advertisement
మరణించిన వ్యక్తిని చూసి వచ్చిన వెంటనే స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు. ఒంటినిండా నూనే పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్ధాలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం. హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరం పై అక్కడక్కడ పడుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?