Advertisement
టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Advertisement
ఆదివారం జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పై టీం ఇండియా ప్రతికారం తీర్చుకుంది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ప్రదర్శనను ప్రశంసిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచ్చాయ్ కూడా ఈ మ్యాచ్ ను వీక్షించారు. హ్యాపీ దీవాలి. ఈ గొప్ప సమయాన్ని అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మ్యాచ్ చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళి సంబరాలు చేసుకున్నాను. అద్భుతమైన ఆట, అద్భుతమైన ప్రదర్శన అంటూ సుందర్ పిచ్చాయ్ ట్వీట్ చేశారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ 2022 అని హ్యాష్ ట్యాగ్ లను ఆయన జత చేశారు.
Advertisement
ఈ ట్వీట్ కు స్పందించిన మొహమ్మద్ షహజీబ్ అనే పాకిస్తానీ, మీరు తొలి మూడు ఓవర్లు కూడా చూడండి అని సమాధానం ఇచ్చాడు. తొలి 3 ఓవర్లలో పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా, రాహుల్ 4 పరుగులకే అవుటయ్యాడు. దీన్ని ఉద్దేశించే సదరు పాకిస్తానీ అలా ట్విట్ చేశాడు. అతడి అంతర్యాన్ని అర్థం చేసుకున్న సుందర్ పిచ్చాయ్, అది కూడా చేశాను. భూవీ, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ భారత బౌలర్లను ప్రశంసించాడు. నేను చెప్పింది టీమిండియా ఇన్నింగ్స్ అంటూ షహజీబ్ బదులిచ్చాడు. ఈ ట్వీట్ ను గూగుల్ సీఈవో లైట్ తీసుకున్నారు. కానీ నేటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. సుందర్ పిచ్చాయ్ సమయస్ఫూర్తిని కొందరు పొగడగా, మరికొందరు మాత్రం, అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు.
READ ALSO : కోహ్లీ దెబ్బకు..దారుణంగా పడిపోయిన యూపీఐ లావాదేవీలు
I am talking about Team India innings
— Muhammad Shahzaib (@shahzaib_rid) October 24, 2022