Advertisement
మనం సోషల్ మీడియాలో రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చూస్తూ ఉంటాం. ఈ పజిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రాలలో దాగి ఉన్న వాటిని కనుగొనేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. మరికొన్ని చిత్రాలలో ఉండే పజిల్స్ తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. మరి కొంతమంది కొత్త కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ ని పోస్ట్ చేసి నేటిజన్ల మెదడుకు మెరుగు పెట్టే విధంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ అనేది ఒక వస్తువు లేదా చిత్రాలు మనకు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అవి మన ఆలోచనలను కూడా మార్చగలవు. ఇక కొన్ని పజిల్స్ మనల్ని మోసం చేస్తాయి. మెదడుకు మోసపూరితంగా, గందరగోళపరిచే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని చూసినప్పుడు మొదట మీకు ఏం అనిపించింది అనే అంశాన్ని కీలకంగా తీసుకుంటున్నారు.
Advertisement
Read also: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి రిషి సునక్ కి మధ్య సంబంధం ఇదే..
Advertisement
ఈ పజిల్ దట్టమైన అడవి యొక్క చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పజిల్ లో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనమని ప్రజలను సవాల్ చేస్తోంది. ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షిని నిర్ణీత సమయంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే గుర్తించగలరని చెప్పబడింది. ఈ చిత్రంలో ఎత్తైన చెట్లతో నిండిన అడవిని చూడొచ్చు. ఈ పజిల్ లో ఒకచోట అందమైన చిన్న పక్షిి దాగి ఉంది. కానీ దానిని గుర్తించడం అంత సులభం కాదు. ఐదు సెకండ్ల గడువులో ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షిని చాలామంది కనుగొనలేక పోవడంతో వీక్షకులు ఆశ్చర్యపోయారు. మీరు ఈ పజిల్ ని ఐదు సెకండ్లలో సాల్వ్ చేయగలరని అనుకుంటున్నాము.
కనిపెట్టలేకపోయారా… అయితే మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాము. మధ్యలో ఉన్న చెట్టు పైభాగాన్ని నిశితంగా పరిశీలించండి. చెట్టు కొమ్మలలో ఒక దానిపై నీలం రంగు పక్షి కూర్చుని ఉంది. ఆ పక్షి చుట్టూ రెడ్ సింబల్ ని రౌండ్ చేశాము. బాగా పరిశీలించి చూస్తే సులభంగా మీరు ఆ పక్షిని గుర్తించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పజిల్స్ ని మీ ముందుకు తీసుకొస్తాం.