Advertisement
రాజకీయాల్లో నమ్మకం చాలా ముఖ్యం. ఒక్కసారి జనం నమ్మితే ఆ నాయకుడ్ని గుండెల్లో పెట్టుకుంటారు. కాపు కాసి మేమంతా మీ వెంటే అనే ధైర్యాన్ని ఇస్తారు. ఆ నమ్మకం అనేది నాయకుడ్ని బట్టి ఉంటుంది. అతను చేసే సేవలు, పనులే జనానికి నిత్యం గుర్తు చేస్తుంటాయి. జనహితమే అభిమతంగా భావించే అలాంటి నాయకులు చాలామందే ఉన్నారు. వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకరనేది నల్గొండ ప్రజల మాట.
Advertisement
వాళ్లలా అనుకోవడం వెనుక చాలా కారణాలున్నాయి. గతుకుల రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు, రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో నిత్యం యాక్సిడెంట్లు.. ఇదీ.. కొన్నేళ్ల క్రితం నల్గొండ జనం నిత్యం మాట్లాడుకునే మాటలు. రోజూ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతుండేది. అలా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలు నెలకొన్నాయి. అధికారులెవరూ పట్టించుకోలేదు. నాయకులమని చెప్పుకున్న వారికీ దయ కలగలేదు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం చలించిపోయారు.
Advertisement
జరుగుతున్న ప్రమాదాలు.. ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కదిలారు వెంకట్ రెడ్డి. తాను ఎంతగానో ప్రేమించే నల్గొండ నరకంలా ఉండటంతో చూడలేకపోయారు. వెంటనే కార్యాచరణ సిద్ధమైంది. కోమటిరెడ్డి చొరవతో అద్భుతమైన ఫ్లైఓవర్ సాకారమైంది. వెంకట్ రెడ్డి దంపతుల తీరని కడుపుకోత నుంచి ఆవిర్భవించిన ప్రతీక్ ఫౌండేషన్.. నల్గొండ బిడ్డల పాలిట వరంలా మారింది. ప్రతి అవసరానికీ తల్లిలా ఆదుకుంటోంది అని స్థానికులు చెబుతున్నారు.
కోమటిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే ప్రతీక్ ఫౌండేషన్ పుణ్యమా అని నల్గొండ కొత్తరూపాన్ని సంతరించుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్గొండ రూపమే మారిపోయింది. పేదవారికి ఇండ్లు, అద్భుతమైన సీసీ రోడ్లు, తాగునీరు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇలా ఒక్కటేమిటి.. ప్రతీక్ ఫౌండేషన్ తమకు దేవుడిచ్చిన వరంలా మారిందని అంటున్నారు స్థానికులు.