Advertisement
సంక్రాంతి పండుగకు పెద్దపెద్ద సినిమాలు పోటీ పడడం సహజమే. పెద్ద పండుగ కావడంతో ఇంట్లో ఉన్న అందరూ సినిమాకు రావాలని ఆసమయంలో రిలీజ్ లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలా.. ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటరత్న బాలయ్య పోటీ పడతారని టాక్ నడుస్తోంది. ఈ పోటీ సోషల్ మీడియాలో రచ్చకెక్కడంతో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ కలగజేసుకోవాల్సి వచ్చింది.
Advertisement
ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. దీనికి వీర సింహారెడ్డి అనే టైటిల్ పెట్టారు. అలాగే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్యగా అలరించనున్నారు. ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని మొదట్నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో వీర సింహారెడ్డి కూడా వస్తుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
Advertisement
అయితే.. టీడీపీ ఫర్ ఎవర్ అనే పేజ్ లో చిరు, బాలయ్య పోటీ పడిన సినిమాల లిస్ట్ తీసి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుండగా.. లోకేష్ కలగజేసుకున్నారు. తమ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి. తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.