Advertisement
మనం పెద్దగా గమనించని విషయాల్లో ఒకటి హోటల్ లో తెల్లటి బెడ్ షీట్ లే ఎందుకు ఉంటాయని… దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ అనేది పెద్దగా ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. అసలు ఏంటీ దాని వెనుక ఉన్న కారణం…? కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇదే విధంగా ఉంటుంది. హోటళ్ళు తమ పరిశుభ్రత ప్రమాణాలను నిరూపించుకోవడానికి తెల్లటి బెడ్ షీట్లను ఎక్కువగా వాడతారు.
Advertisement
దానికి తోడు తెలుపు రంగు కంటికి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందని. వీటి వాడకం ప్రభావవంతమైన మార్గమని ఎన్నో అధ్యయనాల ద్వారా ప్రూవ్ చేశారు. అతిథులు లోపల అడుగు పెట్టగానే, తెలుపు బెడ్ షీట్ల వల్ల, తమ గది పరిశుభ్రంగా ఉందని ఫీల్ అవుతారు. హోటల్ వారి అంతిమ లక్ష్యం అదే కదా…?చిన్న లాడ్జీలు మొదలుకుని 7 స్టార్ హోటళ్ల దాకా ఈ విషయంలో అందరూ ఒకటే ఫాలో అవుతారు.
Advertisement
పరిశుభ్రమైన, విలాసవంతమైన అనుభూతిని ఇవ్వాలనే తపనతో ముందుకు వెళ్తారు. హోటల్ శుభ్రంగా ఉందని కస్టమర్ ఫీల్ అయితే ఇక సక్సెస్ అయినట్టే. మరో కారణం ఏంటీ అంటే… వైట్ కలర్… మరకలను దాచే అవకాశం ఉండదు. అతిథులు ఆహారం తింటున్నప్పుడు, బెడ్ పై ఏదైన పని చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉంటారని మరో కారణం. తెలుపు రంగు మనశ్శాంతిని, విశ్రాంతిని కలుగజేస్తుంది. ఆందోళనలన్నింటినీ అధిగమించి, టెన్షన్ మొత్తాన్ని మరచిపోయే విధంగాచేయడంలో వైట్ సక్సెస్ అవుతుంది. జంటలకు మనస్పర్థలు తొలగిపోవడానికి కూడా వైట్ హెల్ప్ చేస్తుంది.
READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!