Advertisement
ప్రతి మాసంలోను ఏవో కొన్ని పండగలు రావడం సహజం. కానీ కార్తీకమాస విశిష్టత ఏమిటంటే, ఇందులో ప్రతిరోజు ఒక పండుగే! జపతపాలతో, ఉపవాసాలతో, దీప దానాలతో, కార్తీక స్నానాలతో, వ్రతాలతో కార్తీకమాసం అంతా దైవం నామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కార్తీక మాసం లో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులు ఏమి చేయనవసరం లేదు. కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నిష్ట. కార్తీకమాసంలో ఉపవాసం ఎలా చేయాలి. నియమాలు ఇవే.
Advertisement
శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యము బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.
ఇవి చేస్తే మంచిది
Advertisement
ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు బస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌక్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణం లోని అనేక గాధలు, ఇతివృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు.
ఇది చేయరాదు
తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం.
ఇవి కూడా చదవండి : పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!