Advertisement
నూతన దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు, డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కోన వెంకట్ కథా, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి.. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Advertisement
Advertisement
కానీ ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగానే కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేస్తూ సినిమా కలెక్షన్ల పై దెబ్బ కొడుతున్నారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సన్నీలియోన్ కి తెలుగు రాకపోయినప్పటికీ.. గ్లామర్ ని బేస్ చేసుకుని ఇంతకాలం ఐటెం సాంగ్స్, గెస్ట్ అపీరియన్స్ వరకు పరిమితం చేశారు. కానీ మంచు విష్ణు ఒక్కడే సన్నీకి హీరోయిన్ గా ఈ చిత్రంలో మంచి రోల్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
అయితే మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ కరెంటు తీగ సినిమాతో సన్నీలియోన్ ని పరిచయం చేస్తే.. జిన్నా సినిమాతో మంచు విష్ణు సన్నీ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం సన్నీలియోన్ తీసుకున్న పారితోషకం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం సన్నీ తీసుకున్న రేమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం సన్నీలియోన్ ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. సన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.
Read also: సమంతను వేధిస్తున్న వ్యాధి లక్షణాలు ఇవే..!!