Advertisement
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “బద్రి” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు పూరి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, చిరుత, పోకిరి, నేనింతే, బిజినెస్ మేన్, టెంపర్ తదితర చిత్రాలు ఘనవిజయాన్ని సొంతంం చేసుకున్నాయి. అలాగే పోకిరి, హార్ట్ ఎటాక్ చిత్రాలకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
Advertisement
Read also: “జెట్టి” సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని ప్రశంసలు
తెలుగు చిత్ర సీమలో చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పేరొందిన పూరి జగన్నాథ్.. తన డైలాగ్స్ ద్వారానే ప్రేక్షకులను అలా అర నిమిషంలోనే భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తుంటారుు. అయితే సినీ రంగంలో వరుస విజయాలు సాధించిన దర్శకులకు ఒక్క డిజాస్టర్ వల్ల కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అనే సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుతం పూరి జగన్నాథ్ కెరీర్ కు సంబంధించి ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ” లైగర్” సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని అందరూ భావించారు. కానీ ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. సినిమా ముందున్న హైప్ వల్లే ఈ రేంజ్ నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. సినిమాలో విషయం లేకపోవడం, అవుట్ డేటెడ్ స్టోరీ అవ్వడం, పూరి మార్క్ కనిపించకపోవడంతో సినిమాను చూసిన జనాలు తిరస్కరించేశారు.
Advertisement
కానీ ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయల ఓటీటి ఆఫర్ వచ్చినా.. మూవీ యూనిట్ రిజెక్ట్ చేయడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఒకవేళ ఈ చిత్రాన్ని ఓటీటి కి గనుక ఇచ్చి ఉంటే పూరి జగన్నాథ్ కి భారీగా లాభాలు మిగిలేవని చెప్పొచ్చు. అయితే గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ రైటింగ్ విషయంలో వీక్ అయ్యారని.. సొంతంగా సినిమాలను నిర్మించడం కూడా ఆయనకు ఒకంత మైనస్ అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇతర రైటర్లు రాసిన కథలతో పూరి జగన్నాథ్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాలను పూరి జగన్నాథ్ మార్చుకోకపోతే మాత్రం భారీ స్థాయిలో నష్టం తప్పదని చెప్పవచ్చు.