Advertisement
ఈమధ్య ప్రేక్షకులు భారీ బడ్జెట్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న సినిమాలకే పట్టం కడుతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అటువైపు కూడా చూడట్లేదు. ఇక మరి కొంతమంది ప్రేక్షకులు భారీ బడ్జెట్ సినిమాలను థియేటర్లలో చూసి.. చిన్న సినిమాలను లైట్ తీసుకుంటున్నారు. వీటిని ఓటీటీ లో చూసుకోవచ్చనే ధోరణిలో ఉన్నారు. అయినప్పటికీ మంచి కాన్సెప్ట్ తో చిన్న సినిమాల నిర్మాతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ బరిలోకి ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Advertisement
1) తగ్గేదేలే.
దండుపాళ్యం శ్రీనివాసరాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం “తగ్గేదేలే”. ఈ సినిమాలో దివ్య పిల్లై హీరోయిన్ గా నటిస్తోంది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మొదటి చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2) లైక్ షేర్ సబ్స్క్రయిబ్.
మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “లైక్ షేర్ సబ్స్క్రయిబ్”. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ కామెడీ చిత్రాన్ని నిర్మించారు.
3) బొమ్మ బ్లాక్ బస్టర్.
Advertisement
రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు హీరోగా తెరకెక్కిన చిత్రం ” బొమ్మ బ్లాక్ బస్టర్”. ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల నిర్మించారు.
4) జెట్టి.
సుబ్రహ్మణ్యం పిచ్చుక్క దర్శకత్వంలో నందితా శ్వేత, కృష్ణా మాన్యం జంటగా నటించిన చిత్రం ” జెట్టి”. వేణుమాధవ్ రెడ్డి కూనప రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రియలిస్టిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
5) సారధి.
యువ దర్శకుడు జాకట రమేష్ దర్శకత్వంలో నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కిన చిత్రం ” సారధి”. నరేష్ యాదవ్, కృష్ణమూర్తి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ క్రీడ అయిన ఖో ఖో నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
6) బనారస్
జయతీర్థ దర్శకత్వం లో జైద్ ఖాన్, సోనాల్ మోంటేరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ” బనారస్”. ఈ రొమాంటిక్ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.
7) ఊర్వశివో రాక్షసివో
రాజేష్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం ” ఊర్వశివో రాక్షసివో”. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ – వీరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read also : Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 2.11.2022