Advertisement
టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటిని తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు, అయ్యన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక సీఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగలగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడుని అరెస్టు చేయడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే పదికి పైగా కేసులు పెట్టారన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చివేత మొదలు, అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
Advertisement
చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టిన పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్ళ మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై బీసీ నేతల గలాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్ట్ అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్నపాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
READ ALSO : T20 World Cup 2022 : సెమీస్ రేసులోకి పాకిస్తాన్ వస్తుందా ? ఇంటికి పోతుందా ?