Advertisement
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు, ప్లాప్ సినిమాలు, బిగ్గెస్ట్ డిజాస్టర్లు ప్రతి హీరో కెరియర్ లో ఉన్నాయి. భారీ బడ్జెట్ తో, అన్ని హంగులతో సినిమాను రూపొందించినప్పటికీ.. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. అలా డిజాస్టర్ గా మిగిలిన 10 మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) కొమరం పులి.
ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన కొమరం పులి పాతిక కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.
2) షాడో.
మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కినకిన షాడో 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చింది.
3) స్పైడర్.
మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.
4) రెబల్.
కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెబెల్ ప్రభాస్ కెరియర్ లోనే అత్యధిక నష్టాలను తీసుకువచ్చింది.
5) ఒక్క మగాడు.
Advertisement
వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఒక్కమగాడు చిత్రం భారీ పరాజయాన్ని ఎదుర్కొంది.
6) తుఫాన్.
రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత చెత్త మూవీగా నిలిచింది తుఫాన్. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్, మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ ఫ్లాప్ గా నిలిచింది.
7) శక్తి.
మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి భారీ నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాల జాబితాలో ఈ మూవీ చేరింది.
8) బ్రహ్మోత్సవం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం కనీస ఆదరణ దక్కించుకోలేక మహేష్ చిత్రాలలో అత్యంత చెత్త చిత్రంగా నిలిచింది.
9) అఖిల్.
వి.వి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని వారసుడు అఖిల్ డిబ్యు మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుని నష్టాలను మిగిల్చింది.
10) అజ్ఞాతవాసి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చింది.
Also Read: దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!!