Advertisement
బాక్సాఫీస్ దగ్గర ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలామందే ఉన్నారు. ఒక మూవీ హిట్ అయిన తర్వాత ఆ హీరో నుంచి వస్తున్న ప్రతి సినిమా ప్లాప్ అయితే.. వారి నుంచి స్ట్రాంగ్, సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తారు. నిజానికి సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా అట్రాక్ట్ చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు అనేది నిజం. కొంతమంది వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరి కొంతమంది వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. అలా మంచి కం బ్యాక్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: వెండితెరకు సడన్ గా దూరమైన టాలీవుడ్ హీరోయిన్లు వీరే..!!
1) గోపీచంద్.
యజ్ఞం, ఆంధ్రుడు, లౌక్యం, రణం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న గోపీచంద్.. ఆ తర్వాత ఆక్సిజన్, పంతం, జిల్ లాంటి ఫ్లాపులతో మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల మారుతీ దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా నిరాశపరిచింది.
2) విజయ్ దేవరకొండ.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీత గోవిందం వంటి సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత.. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి. ఓ మంచి సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.
3) నాని.
నాచురల్ స్టార్ నాని సిచువేషన్ కూడా దాదాపుగా ఇంతే. గ్యాంగ్ లీడర్ జ్ఞాపకాలతో వెయిట్ చేస్తున్న నాని కూడా ఓ సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలి.
4) ప్రభాస్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో, రాధే శ్యామ్ సినిమాల రిజల్ట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ప్రభాస్ కూడా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
5) శర్వానంద్.
Advertisement
యువసేన, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, శతమానం భవతి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న శర్వానంద్.. ఆ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. శర్వానంద్ కూడా ఓ మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
6) రవితేజ.
క్రాక్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన రవితేజ.. ఆ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో మళ్ళీ అయోమయంలో పడ్డాడు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ ఏదో ఒక సినిమాతో మంచి కం బ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు.
7) వైష్ణవ్ తేజ్.
ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ తేజ్.. కొండ పొలం, రంగ రంగ వైభవంగా సినిమాలతో అభిమానులను నిరాశపరిచాడు. వైష్ణవ తేజ్ కూడా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
8) రాజ్ తరుణ్.
కుమారి 21F, సినిమా చూపిస్త మామ వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని అందుకున్నాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
9) మంచు మనోజ్.
దొంగ దొంగది, రాజు భాయ్, కరెంట్ తీగ వంటి సినిమాలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు మనోజ్.
10) చిరంజీవి.
ఆచార్య ఫలితం నిరాశపరచడంతో వాల్తేరు వీరయ్య, బోళా శంకర్ రెండు చిత్రాలలో ఏదో ఒకదానితో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
Also Read: వెండితెరకు సడన్ గా దూరమైన టాలీవుడ్ హీరోయిన్లు వీరే..!!