Advertisement
జ్యోతిష్యం ప్రకారం గ్రహణం ఒక ముఖ్యమైన సంఘటన. అది సూర్యగ్రహణం అయినా లేదా చంద్రగ్రహణం అయినా సరే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల మీద దాని ప్రభావం చూపుతుంది. అంటే గ్రహణం కొందరికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. ఈ సంవత్సరం అంటే ఇటీవలే చివరి సూర్యగ్రహణం సంభవించింది. అది దీపావళి మరసట రోజున సూర్యగ్రహణం ఏర్పడింది.
Advertisement
ఇక ఈ ఏడాది చివర్లో అంటే నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. కాబట్టి గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో ఆహారం వండడం గాని లేక తినడం గానీ అస్సలు చేయకూడదు. గుడి తలుపులు అలాగే పూజా గదులు మూసివేయాలి.
Advertisement
గ్రహణ సమయంలో నిద్ర పోకూడదని కూడా చెబుతారు. గ్రహణ సమయంలో భగవంతుణ్ణి జపించాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారు ఇంటి బయట నుంచి అస్సలు బయటకు రావద్దు. అలాగే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కత్తులు అలాగే కత్తెరతో ఏ పని చేయకూడదు. గ్రహణం రోజున చెట్లను అలాగే మొక్కలను తాకడం మానుకోండి. గ్రహణం ప్రారంభం అయ్యే ముందు అన్ని వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను ఉంచండి. గ్రహణం తర్వాత ఇంటికి శుభ్రం చేసి ఇంటింటా గంగాజలం చల్లాలి. అలాగే అన్నదానం చేస్తే మంచిది.
Read also : Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 06 నుంచి 12 నవంబర్ 2022 వరకు