Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని కూడా చుట్టుముట్టింది. ఈ స్కామ్ లో కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కెసిఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు.
Advertisement
ఇది ఇలా వుండగా తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాo లో సిబిఐ దూకుడు పెంచింది. మరో ఇద్దరిని అరెస్టు చేసింది. వీరిలో ఒకరు శరత్ చంద్రారెడ్డి ఈయన విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు. అరబిందో ఫార్మా డైరెక్టర్. మరొకరు తెలంగాణకు చెందిన వినయ్ బాబు. వీరిద్దరూ పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయడానికి, ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వరకు అరబిందో నుంచి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిండికేట్ లోకి ప్రవహించాయని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికీ మూడు అరెస్టులు జరిగాయి. తెలంగాణ అధికార పార్టీ పెద్దలకు బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్ళయ్ ను అరెస్టు చేయలేదు. కానీ అభిషేక్ రావు ను అరెస్టు చేశారు. రామచంద్ర పిల్లై అప్రూవర్ గా మారెందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఆయన చాలా విషయాలు సిబిఐ కి చెప్పరని అంటున్నారు. అందుకే అభిషేక్ రావును అరెస్టు చేశారని, శరత్ చంద్ర రెడ్డిలపై కూడా స్పష్టమైన ఆధారాలు లభించడంతో అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. వైసిపి ఎంపీ లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా ప్రశ్నించింది. అరబిందో శరత్ చంద్ర రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, సోదరుడు. అరబిందోలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అరెస్ట్ ముప్పు కొంచెం ఉంది. అల్లుడు సోదరుడిని కాపాడేందుకు విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
Read Also : ఈ స్టార్ హీరోలు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసే వాళ్ళు తెలుసా?