Advertisement
తెలంగాణలో ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. తాజాగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? త్వరలోనే కొత్త పార్టీ ఆవిర్భావం కాబోతోందా? అంటే నిజం అనే సంకేతాలు వస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ తో ఆవిర్భవించింది టిఆర్ఎస్. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దీక్షతో రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చారు. సీఎంగా కొనసాగుతున్నారు. అప్పటివరకు తెలంగాణను ఏలిన కాంగ్రెస్, టీడీపీలు ఉండనే ఉన్నాయి.
Advertisement
ఆనాటి కాంగ్రెస్ నుంచి తాజాగా పుట్టిన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరకు తెలంగాణలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనున్నట్లుగా పక్కా సమాచారం.
Advertisement
అయితే త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని అంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆకునూరి మురళి, తెలంగాణలో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన ఆయన, ఆదర్శ రాజకీయాలను మళ్లీ తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తా, త్వరలోనే నూతన రాజకీయ పార్టీని పెడతానంటూ వెల్లడించారు.
Read Also : లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..?