Advertisement
ప్రధాని మోడీ టూర్ తో ఏపీ రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా మారాయి. ఆయన్ను జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడం.. మీటింగ్ విషయాలేవీ బయటకు రాకపోవడంతో రకరకాల వాదనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బీజేపీ సమావేశంలో ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయాలని సూచించారని కమలనాథులు ప్రకటించారు. జనసేన, బీజేపీ కలిసి ఇదే ఊపులో యుద్ధం మొదలుపెడతాయని.. ఇక సర్కార్ కు చుక్కలే అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. సీఎం జగన్ కూడా మోడీ టూర్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.
Advertisement
రూ.10 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు విశాఖ కేంద్రంగా శ్రీకారం చుట్టింది కేంద్రం. బహిరంగ సభలో ప్రధాని తెలుగువారి గొప్పతనం.. దేశ, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. అయితే.. సీఎం జగన్ చేసిన చేసిన ప్రసంగంపై సర్వత్రా చర్చ చర్చనీయాంశంగా మారింది. ‘‘ సార్, ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైంది. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా రైల్వే జోన్ వంటి వాటిపై మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నా. పెద్దలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి” అంటూ విన్నవించారు జగన్.
Advertisement
అయితే.. జగన్ వ్యాఖ్యలపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి కేసుల నేపథ్యంలో పూర్తిగా సరెండర్ అయ్యారని.. రెండోది పవన్, మోడీ భేటీ భయం అని అంటున్నారు. పవన్ కు మోడీ రోడ్ మ్యాప్ ఇస్తే.. వైసీపీకి గడ్డుకాలం తప్పదని.. అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అందుకే జగన్ తాము మీవైపే అనే సందేశాన్ని సభా వేదికగా మోడీని కాకా పట్టారని అంటున్నారు.
ఇటు జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎటాక్ స్టార్ట్ చేసింది. ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి గారూ మీ తెలివి అమోఘం… ప్రధానమంత్రికి అర్థం కాకుండా రాష్ట్ర సమస్యలన్నీ తెలుగులో ప్రస్తావించారు. ఆయనను యథావిధిగా ప్రసన్నం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మాత్రం, సమస్యలన్నీ ఏకరవు పెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తూతూ మంత్రంగా ఉభయతారకంగా మాట్లాడిన మీ శల్య సారథ్యం రాష్ట్రానికో వరం” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.