Advertisement
కొద్ది రోజులుగా టీవీల్లో, సోషల్ మీడియాలో మార్మోగిన పేర్లు షోయబ్ మాలిక్, సానియా మీర్జా. పెళ్లప్పుడు ఏ విధంగా వైరల్ అయ్యారో.. ఇప్పుడు అంతకుమించి అయ్యారు. రేపో మాపో ఈ జంట విడాకులు తీసుకుంటోందని ఎన్నో వదంతులు వచ్చాయి. గొడవ ఎక్కడ మొదలైంది..? ఏం జరిగింది..? ఇలా చాలా వార్తలు బయటకొచ్చాయి. కానీ, వీళ్ల బ్రేకప్ అంతా డ్రామాగా అనిపిస్తోందని తాజా చర్చ.
Advertisement
విడాకులపై ఎన్ని వార్తలు వచ్చినా ఈ జంట స్పందించలేదు. అప్పుడే అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదంతా నిజమేనా అనే అనుమానం మొదలైంది. సరిగ్గా ఇదే టైమ్ లో ఓ పోస్టర్ బయటకొచ్చింది. ఇద్దరూ కలిసి ఓ టాక్ షో చేస్తున్నారని.. దీని ద్వారా అర్థం అవుతోంది. ప్రముఖ పాకిస్థానీ ఓటీటీ ప్లాట్ ఫాం ఉర్దూ ప్లెక్స్ లో మీర్జా మాలిక్ షోలో ఈ జంట కలిసి నటిస్తున్నారు.
Advertisement
ఈ షో కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో మాలిక్, సానియా కలిసి హోస్ట్ గా చేయబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే తొలి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఇందుకు సంబంధించి ఉర్దూ ప్లెక్స్ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
మాలిక్ ఓ మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడని.. అందుకే సానియా దూరంగా ఉంటోందని ప్రచారం సాగింది. కానీ, బయటకొచ్చిన ఫోటోతో ఇదంతా తప్పుడు ప్రచారం అని తేలిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం షో ప్రమోషన్ కోసం ఇంత డ్రామా ఆడాలా? అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. 2010లో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా సానియా, మాలిక్ వివాహం జరిగింది.