Advertisement
టి20 ప్రపంచ కప్ 2022 సెమీస్ పోరులో టీమిండియాకు నిరాశ మిగిలింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరందించేందుకు, ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీం ఇండియా, సెమీస్ లో పోరాటం ముగించి తిరుగు పయనం అయింది. ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12 లో ఐదు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్ గా సెమిస్ చేరిన భారత్, ఆడి లైడ్ వేదికగా గత గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో పరాజయం పాలైంది. అయితే, ఓడిపోతామని రోహిత్ శర్మకు ముందే తెలుసు అని ఓ వార్త వైరల్ అవుతుంది.
Advertisement
టి20 వరల్డ్ కప్ ఈసారి ఎలాగైనా సరే టీమిండియానే గెలుస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ రియాలిటీలో జరిగింది వేరు. సెమీస్ లో అడుగు పెట్టేంత వరకు బాగానే ఆడిన మన జట్టు, ఇక్కడ మాత్రం ఇంగ్లాండ్ చేతిలో గోరంగా ఓడిపోయింది. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. దీంతో టీమ్ ఇండియా పై ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ‘తప్పు అక్కడ జరిగింది, పొరపాటు ఈ ఆటగాడే చేశాడు’ అని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ మ్యాచ్ లో ఓడిపోతామని కెప్టెన్ రోహిత్ శర్మకు మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే తెలుసని అంటున్నారు. దానికి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు.
Advertisement
సెమీస్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరగడానికి ముందు ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘నాకౌట్ మ్యాచులు కీలకమే. కానీ ఒక్క నాకౌట్ గేమ్ లో ఆడనంత మాత్రాన వాళ్ళని తక్కువ అంచనా వేయలేం. నాకౌట్ మ్యాచ్ మీ గేమ్ ని డిసైడ్ చేయదు’ అని అన్నాడు. ఇప్పుడు దీన్నే హైలెట్ చేస్తున్న పలువురు క్రికెట్ అభిమానులు, మ్యాచ్ ఓడిపోతామని అనిపించే రోహిత్ ఈ వ్యాఖ్యాలు చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆడి లైడ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 168/6 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్, వికెట్ పడకుండా 170 పరుగులు చేశారు. తమ జట్టుని ఫైనల్ కి తీసుకెళ్లారు.
Rohit Sharma on Knockout game.. pic.twitter.com/vQ2EmkIHcg
— RVCJ Media (@RVCJ_FB) November 10, 2022
Where did it go wrong for Rohit Sharma & his men? pic.twitter.com/pTYSneuOdW
— CricTracker (@Cricketracker) November 10, 2022
READ ALSO : సుశీ ఇన్ఫ్రా పై తెలంగాణ సర్కార్ గురి !