Advertisement
సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సహా సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విపరీతమైన పోటీ ఉందనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో డైలాగ్ డెలివరీ తో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.
Advertisement
తన సినిమాలలో చాలా సినిమాల ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. మాస్ లో ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా కృష్ణకు పేరుంది. రాజకీయ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణ విభేదించిన కృష్ణ అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను చూసి ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని కృష్ణ సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమాలో నటించిన సమయంలో కృష్ణ, ఎన్టీఆర్ ను కలిశారు. ఆ సినిమాలో రాముని వేషం ఇవ్వాలని కృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ను అడిగారు.
Advertisement
కృష్ణ చిన్నవాడిగా కనిపించడంతో రాముడు వేషానికి అప్పుడే నువ్వు సరిపోవని ఎన్టీఆర్, కృష్ణతో అన్నారు. నీకు లక్ష్మణుడి పాత్ర ఇద్దామంటే అప్పటికే ఆ పాత్రను వేరే వాళ్లకు ఇచ్చానని సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ తో చెప్పారు. మూడేళ్ల తర్వాత కనిపించాలని ఎన్టీఆర్ కృష్ణకు సూచించి పంపించారు. ఆ సమయంలో కృష్ణా వయస్సు 18 సంవత్సరాలు కాగా, మూడేళ్ల తర్వాత తేనె మనసులు సినిమాతో కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ, ఎన్టీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కాలంలో ఎన్టీఆర్, కృష్ణ పలు సినిమాల్లో అన్నదమ్ములుగా కనిపించారు. పోటీపడి మరి అటు ఎన్టీఆర్, ఇటు కృష్ణ సినిమాలను నిర్మించడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ కు రాజకీయంగా కూడా కృష్ణ గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే.
Read also: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !