Advertisement
సూపర్ స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో మంగళవారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ, రాజకీయరంగం, సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మర్చిపోలేని సంవత్సరం అనే చెప్పవచ్చు. ఇక కృష్ణమూర్తి నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు.
Advertisement
ఇక సూపర్ స్టార్ కృష్ణ కి ఆయన మనవలు, మనవరాళ్లు అంటే ఎంతో ప్రేమ. తాజాగా తన తాతయ్య గురించి మహేష్ బాబు కూతురు సితార ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నానక్ రామ్ గూడా లో ఉంటున్న కృష్ణను వీక్ ఎండ్ లో మహేష్ బాబు తన భార్య, బిడ్డలతో వెళ్లి కలిసేవారు. ఆ సమయంలో కృష్ణతో మహేష్ బాబు కూతురు సితారతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సితార ఘట్టమనేని తన తాతయ్య సూపర్ స్టార్ కృష్ణని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యింది.
తాతయ్యతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను ఎంతో బాధతో తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ‘ఇక ప్రతి వీక్ ఎండ్ లంచ్ గతంలో మాదిరిగా ఉండదు. మీరు నాతో ఎన్నో మంచి విషయాలు పంచుకున్నారు. గొప్ప విషయాలు నేర్పించారు. నన్ను బాగా నవ్వించారు. అది ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో ఉంటాయి. మీరు నా హీరో, ఎప్పటికైనా మీరు గర్వించే స్థాయికి చేరుకుంటా, ఐ మిస్ యు తాతగారు’ అంటూ ఎమోషనల్ గా రాసుకోచ్చింది. సితార ఘట్టమనేని ఎమోషనల్ మెసేజ్ షేర్ చేయడంతో పాటు కృష్ణతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే