Advertisement
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. 350 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణ నిర్మాతగాను తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే అభిరుచితో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేశారు. ఇక పద్మాలయ స్టూడియో అధినేతగా రాణించారు. ఒక మనిషి ఆల్ రౌండర్ గా తెలుగు సినీ చరిత్రలో ఓ అధ్యాయాన్ని రాశారు.
Advertisement
ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు. కృష్ణ స్వతహాగా సంపాదించినది చాలా ఉంది. అలాగే విజయనిర్మల వల్ల కూడా ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు కలిసి వచ్చాయని తెలిపారు.
Advertisement
ఇకపోతే కృష్ణ గారు కెరియర్ మొదట్లో పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత కొన్ని కారణాలవల్ల బ్యాంకు రుణం చేశారు. అయితే ఆ బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో పద్మాలయ స్టూడియో తో పాటు, ఆయన ఇల్లు ఇతరత ఆస్తులను కూడా వేలం వేశారు. ఇలా వేలం పాటలో ఆస్తులు కోల్పోవాల్సిన సమయంలో రంగంలోకి మహేష్ బాబు దిగారని రామారావు తెలిపారు. ఈ విధంగా ఈయన ఆస్తులన్నీ వేలం వేసే సమయంలో మహేష్ బాబు గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి తనకు కొంత సమయం కావాలని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తాను డబ్బు మొత్తం చెల్లిస్తానంటూ, ఆ భారాన్నంతా తన భుజాన వేసుకున్నారని ఈయన తెలిపారు. అప్పట్లో కృష్ణ గారి ఆస్తులు 15 కోట్ల రూపాయలకు వేలం వేశారు ఈ సందర్భంగా రామారావు తెలిపారు.
Read also: అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే