Advertisement
వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్ల పై మరింత శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని కోవిడ్ – 19 మరోసారి తెలియజేసింది. మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. వృద్ధాప్యంలో సరైన పోషకాహారం తీసుకోకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, ఒంట్లో శక్తి లేకపోవడం, హృద్రోగాలు, మధుమేహం.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే 50 ఏళ్ల వయసు దాటాక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో చక్కెర పరిమాణాన్ని వీలైనంతవరకు తగ్గించాలి. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం లేదా ఇతర అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు సమతుల్య ఆహారం తినాలి. వ్యాయామం చేస్తూ ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు కూడా 50 ఏళ్లు దాటిన వారు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆహార పదార్థాలను తీసుకునేలా చూడండి.
Advertisement
Read also: 2022లో ఆకస్మికంగా మరణించిన టాలీవుడ్ ప్రముఖులు..
1) ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి. ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు గుడ్లు తింటే మంచిది. గుండెకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
Advertisement
2) వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఎముకల ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం, విటమిన్ బి, డి, జింక్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పెరుగులో కనిపిస్తాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
3) నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే 50 ఏళ్లు దాటిన వారు మరింత ఎక్కువగా నీరు, లేదా ద్రవపదార్థాలు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
4) ఇక వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా చేర్చుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు విటమిన్ సి, డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఫలితంగా ఉభగాయం తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆహారం అరగడం కూడా సమస్యగా మారవచ్చు. అందువల్ల తక్కువ మోతాదులో తరచూ తినాలి.