Advertisement
DRDO recruitment 2022: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది DRDO సంస్థ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అప్రెంటిస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 25 గా నిర్ణయించబడింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
Advertisement
DRDO Recruitment
How to Apply DRDO Recruitment 2022 online
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 08 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ -08 పోస్టులు, లైబ్రరీ సైన్స్ – 02 పోస్టులు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ -06 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-10 పోస్టులు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 06 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 06పోస్టులు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 04 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -04 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ – 04 పోస్టులు, లైబ్రరీ సైన్స్ – 01 పోస్ట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 03 పోస్టులు ఉన్నాయి.
Advertisement
ఇక DRDO నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులను ఎలాంటి TA/DA చెల్లించబడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ప్రకారం నెలకు రూ. 8,000-9,000 ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 25 నవంబర్ 2022 లోపు అధికారిక సైట్ www.drdo.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అప్రెంటిస్ షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది.
READ ALSO : ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అలర్ట్.. రేపే మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి