Advertisement
టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు, సహా సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలా ఉండగా, కృష్ణ జీవితం గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అలాంటి విశేషాల్లో ముఖ్యమంత్రుని తన కూతురి పెళ్లికి రావద్దని చెప్పిన సందర్భం ఒకటి. అదేంటి ఒక సీఎంను తన కూతురు పెళ్లికి రావద్దని కృష్ణ అనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? నమ్మశక్యం కాకపోయినా నిజం మాత్రం ఇదే.
Advertisement
ఒక్కసారి కృష్ణ జీవితంలోకి తొంగిచూస్తే, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతిని జయదేవ్ గల్లా కి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పట్లో ఈ వివాహ వేడుక మద్రాస్ లో జరిగింది. ఆ వివాహానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని, కృష్ణ ఆహ్వానించారు. ఆమె తప్పకుండా వస్తానని కూడా మాటిచ్చారు. కృష్ణ, జయలలిత కాంబినేషన్ లో ‘గూఢచారి 116’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించే సెక్యూరిటీ ఓకే చెబితే గాని జయలలిత అక్కడికి వెళ్లేవారు కాదు.
Advertisement
అలాగే కృష్ణ కూతురు పెళ్లిరోజు, జయలలిత సెక్యూరిటీ మనుషులు పెళ్లి మండపానికి వచ్చి కృష్ణను కలిసి మొదటి మూడు వరుసలో కూర్చున్న అందరిని లేపాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇంకా రాజకీయ, సినిమా రంగాలకు చెందిన మంత్రులు, సెలబ్రిటీస్ అందరూ ఆ మూడు వరసల్లో కూర్చున్నారు. వాళ్ళందరినీ లేపడం కృష్ణకు ఇష్టం లేదు. అందుకని, జయలలితకి ఫోన్ చేసి, ‘మీరు పెళ్లికి రావోద్దు. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలు’ అని చెప్పారు. జయలలిత కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని సరే అని ఒక పుష్పగుచ్చము ఆ నవ వధూవరులకు పంపారు. ఆ విధంగా కృష్ణ ముఖ్యమంత్రిని పెళ్లికి రావోద్దని చెప్పారు.