Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో, ఒప్పంద ప్రాతిపాదికన అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మా డి, బిఎస్సి ఎంఎల్టి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Advertisement
Advertisement
అలాగే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. అక్టోబర్ 30, 2022 నాటికి అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు నవంబర్ 19, 2022వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా కింది అడ్రస్ కు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. అకాడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000 వరకు జీతంగా చెల్లిస్తారు. సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్ : District Medical & Health Officer (DMHO), Srikakulam, AP. ఇక పూర్తి సమాచారం కోసం, https://srikakulam.ap.gov.in/ను సంప్రదించాల్సి ఉంటుంది.
Read Also : OTT Release: ‘ఓరి దేవుడా’ మూవీ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే ?