Advertisement
టీ-20 క్రికెట్ లో ఇప్పుడతను ఓ మాన్ స్టర్. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా ఐ డోంట్ కేర్ అంటున్నాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలు బాదేస్తున్నాడు. ఈమధ్యే టీ-20 క్రికెట్ లో ఒక్క ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అంతేనా.. పొట్టి ఫార్మెట్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. అతనే సూర్యకుమార్ యాదవ్.
Advertisement
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ-20లో 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి ట్రెండింగ్ స్టార్ గా మారిపోయాడు సూర్య. ఈ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశాడు. 360 డిగ్రీ మార్క్ షాట్లతో అలరించిన సూర్యా భాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. టీ-20 క్రికెట్ నయా మాన్ స్టర్ గా అవతరించిన ఇతని విషయాలన్నీ తెలుసుకునేందుకు క్రికెట్ ఫాన్స్ గూగుల్ పై పడ్డారు.
Advertisement
సూర్య ఎప్పుడు క్రికెట్ లోకి వచ్చాడు? ఇష్టమైన ఫుడ్ ఏంటి? సొంతూరు ఏది? అసలు.. ఎప్పుడు పుట్టాడు? ఇలా అనేక ప్రశ్నలతో సెర్చ్ చేస్తున్నారట. వారందరికీ కోసం అతని ఫుల్ డీటైల్స్ ఇవిగో.
సూర్యకుమార్ యాదవ్ బయోడేటా
జననం- 1990, సెప్టెంబర్ 14
పుట్టిన ప్రదేశం- ముంబై, మహారాష్ట్ర
స్వస్థలం- వారణాసి, ఉత్తరప్రదేశ్
విద్యార్హత- B.Com
బ్యాటింగ్ శైలి- కుడి చేతి బ్యాటింగ్
జెర్సీ నెంబర్- టెస్ట్: 63, వన్డే: 63, టీ-20: 63, ఐపీఎల్: 77
ఆరంగేట్రం(ఐపీఎల్)- 06-04-2012
ఆరంగేట్రం(వన్డే)- 18-07-2021
ఆరంగేట్రం(టెస్ట్)- 04-08-2021
తల్లిదండ్రులు- స్వప్న యాదవ్, అశోక్ కుమార్ యాదవ్
భార్య- దేవిషా శెట్టి (2016 – Present)
ఇష్టమైన నటులు- షారుక్ ఖాన్, అమిర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, రణ్ వీర్ సింగ్
ఇష్టమైన నటీమణులు- తమన్నా, దీపికా
ఇష్టమైన క్రికెటర్స్- సచిన్, ధోని(బ్యాటింగ్), వసీం అక్రమ్, జహీర్ ఖాన్(బౌలింగ్)