Advertisement
ఢిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ప్రియుడిని కోరడంతో, ఆ దుర్మార్గుడు ప్రేయసిని 35 పార్ట్స్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన ఆరు నెలలకు వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఆప్తాబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రద్ధ అనే యువతి తో ఆప్తాబ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే శ్రద్ధ తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆ దుర్మార్గుడు శ్రద్ధను 35 పార్ట్స్ గా నరికి దారుణ హత్యకు పాల్పడ్డాడు.
Advertisement
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, శ్రద్ధ కనిపించడం లేదని ఆమె తండ్రి ముంబై వాసాయ్ పోలీస్ స్టేషన్ లో గత నెలలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న పోలీసులు విచారణకు ఆప్తాబ్ ను పిలిచారు. అయితే శ్రద్ధ మే 22 నే ఢిల్లీ మెహ్రలి లో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిందని అప్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు ఇతర వస్తువులు ఫ్లాట్ లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదు అన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే అంటే మే 18న ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరు ఢిల్లీ ఫ్లాట్ కు మారి 2 వారాలే అయింది.
Advertisement
అయితే అప్తాబ్ ను విచారించన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు శ్రద్ధ ఖాతా నుంచి ఆప్తాబ్ కు రూ. 54,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీంతో పోలీసులకు అప్తాబ్ పై మరోసారి అనుమానం వచ్చింది. అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ చాట్ ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్ తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. మే 22న వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రలి లోనే ఎలా ఉందని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయాన్నీ పోలీసులకు వెల్లడించాడు అప్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 పార్ట్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు భయానక నిజాన్ని చెప్పాడు. ఒక్కో పార్ట్ ను ఒక్కో రోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు.
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?