Advertisement
ఈనెల 27వ తేదీన టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో వైద్యం కొనసాగుతుంది. పాదయాత్రలో పాల్గొన్న కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు తారకరత్న. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ని చూడడానికి ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వెళుతున్నారు. బాలకృష్ణ దగ్గరుండి మరీ తారకరత్నను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలుస్తుంది నందమూరి కుటుంబం.
Read also: చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
అయితే బెంగళూరులోని ఆసుపత్రిలో నందమూరి కుటుంబీకుల తో పాటు పుంగనూరు టిడిపి ఇన్చార్జ్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండడం గమనార్హం. చల్లా రామచంద్ర రెడ్డి కి తారకరత్నతో పార్టీ పరమైన సంబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యరెడ్డి మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం. తారకరత్న 2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్ లో అలేఖ్యరెడ్డిని కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో తండ్రి మోహనకృష్ణ తో పాటు మిగతా నందమూరి కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్నారు తారకరత్న.
Advertisement
వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే అలేఖ్య రెడ్డి చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కూతురు కావడంతో తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి చల్లా కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. భర్తకు గుండెపోటు రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనంగా ఉండడంతో కుమిలిపోతున్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చుతూ, ధైర్యం చెబుతూ చల్లా భార్య సుప్రియ రెడ్డి కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Advertisement
Read also: అప్పుడు తొడ కొడితే ట్రైన్ వెనక్కి, ఇప్పుడు వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!