Advertisement
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2010లో విడుదలైన “వేదం” సినిమాని దాదాపు మీరందరూ చూసే ఉంటారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాగా కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే కథలను చూపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క అలాంటి పాత్రలో నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుష్క నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
Advertisement
Advertisement
వీరితో పాటు ఈ సినిమాలో మరొక క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అయింది. ఆ పాత్రే కర్పూరం. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ పాత్రకి సంబంధించిన డైలాగ్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ పాత్రకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే కర్పూరం పాత్రను మొదట డైరెక్టర్ క్రిష్ చేయాలట. కానీ క్రిష్ వాళ్ళ తల్లి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. ఈ పాత్రకు సంబంధించిన విషయాలను క్రిష్ తన తల్లికి చెప్పగా.. ఆ పాత్ర చేస్తే పెళ్లి కాదని ఆమె చెప్పారట. దీంతో ఆ సమయంలో అనుష్క పర్సనల్ మేకప్ స్టాఫ్ నిక్కీ పేరుని సజెస్ట్ చేశారంట. అదేవిధంగా నిక్కీ చేసిన ఒక డ్యాన్స్ వీడియోని కూడా క్రిష్ కి చూపించారు. ఆ వీడియో చూసి క్రిష్ కర్పూరం పాత్రకి నిక్కీని ఎంపిక చేశారు.
అయితే ఈ సినిమాలో కర్పూరం పాత్ర చేయబోయినప్పటికీ.. క్రిష్ మరో పాత్రలో సాధువుగా చేశారు. ఇక ఇది ఒకటే కాక వేదం సినిమా కంటే ముందే వచ్చిన గమ్యం సినిమాలో క్రిష్ ఓ నక్సలైట్ గా కనిపించారు. ఈ నక్సలైట్ పాత్ర కోసం క్రిష్ టాలీవుడ్ కి చెందిన 15 మందిని సంప్రదించారట. అయితే అందరూ బిజీగా ఉండడంతో ఫైట్ మాస్టర్ రామ్ – లక్ష్మణ్ మీరే ఈ పాత్ర చేయాలని సూచించారట. దీంతో క్రిష్ తన ఫేవరెట్ అయిన చేగువేరా గెటప్ లో స్టైలిష్ గా హెయిర్ స్టైల్ మార్చుకొని నక్సలైట్ పాత్రలో అద్భుతంగా నటించారు.