Advertisement
దేశవ్యాప్తంగా కాంతార చిత్రం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా.. ఆ తర్వాత అన్ని భాషలలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి చోట కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్రాన్ని హోంభలే ఫిలిం బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఆయన స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదల అయింది. ఇదిలా ఉంటే.. ఇలాంటి కథతోనే మన తెలుగులో కూడా ఒక సినిమా వచ్చిందని మీకు తెలుసా..!
Advertisement
Read also: తెలుగులో రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన చిత్రాలు ఇవే..!!
Advertisement
ఆ చిత్రం ఏదంటే.. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో 2021 లో తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రలలో నటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణం వల్ల థియేటర్లు మూతపడి ఉండడంతో ఈ సినిమాని ఓటిటిలో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు అంత స్పందన రాలేదు. ఈ చిత్రం కూడా ప్రపంచానికి దూరంగా అన్నట్లుగా ఒక గ్రామం ఉంటుంది. కొండకోనల్లో నివసించే అక్కడి జనానికి దొర మాటే శాసనం.
అయితే అక్కడ ఉండే ఒక చెట్టు తొర్రలో బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్ళని బతికించేది, శాసించేది దొరేనని బలంగా నమ్ముతారు. గూడెం సరిహద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలను హరిస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఇక బయట నుంచి ఆ ఊరికి ఎవరు వచ్చినా దొర చంపేస్తాడు. అయితే ఆ ప్రజల జీవితాలను మార్చడానికి దేవుడు రేడియో రూపంలో వస్తాడు. అక్కడి నుంచి కథ ఆసక్తిగా ఉంటుంది. కానీ సినిమాలో నటులు ఎవరికి తెలియక పోవడంతో ఆ సినిమా ఆడలేదు.
Also Read: December : మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే !