Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. దీంతో కొంతమంది హీరోలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. మరికొన్ని చిత్రాలు ఆ అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయి వారి ఖాతాలో నిలుస్తున్నాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క హిందీ మూవీ కూడా సాలిడ్ విజయాన్ని సాధించలేక పోతుంది. ఇలా 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎంత కోటీశ్వరుడో తెలుసా..?
1) ఆచార్య.
మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 80 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.
2) రాధేశ్యామ్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం మార్చ్ 11న విడుదలైంది. ఓవరాల్ గా ఈ సినిమా 120 కోట్ల నష్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
3) లైగర్.
Advertisement
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై 65 కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది.
4) లాల్ సింగ్ చడ్డా.
అమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ మరియు నాగచైతన్య కీలకపాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. 180 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని అసలు ప్రేక్షకులు పట్టించుకోనే లేదు.
5) షంషేరా.
కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం షంషేరా. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.
6) సామ్రాట్ పృథ్వీరాజ్.
చంద్ర ప్రకాష్ ద్వివేది రూపొందించిన మరో భారీ బడ్జెట్ బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఈ బడ్జెట్ లో సగాన్ని కూడా వసూలు చేయలేకపోయింది.
7) ఈ కేటగిరిలో ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి.. మాస్ మహారాజా రవితేజ ఖిలాడి, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, వరుణ్ తేజ్ గని ఇలా చాలా సినిమాలే ఉన్నాయి.
Read also: పూరిని టార్గెట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?