• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » కామెంట్రీ చెబుతూ కుప్పకూలిన ఆసీస్ దిగ్గజం..ఆస్పత్రికి తరలింపు !

కామెంట్రీ చెబుతూ కుప్పకూలిన ఆసీస్ దిగ్గజం..ఆస్పత్రికి తరలింపు !

Published on December 2, 2022 by Bunty Saikiran

Advertisement

క్రికెట్ లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కామెంటేటర్ గా విధులు నిర్వహిస్తున్న అతను చాతినొప్పి బారిన పడ్డాడు. దీంతో వెంటనే పాంటింగ్ ను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

అయితే ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఆసుపత్రికి తరలించామని అతనితో కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న సహచరులు తెలిపారు. కాగా 47 ఏళ్ల పాంటింగ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ‘రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతో ఉన్నాడు. ఈరోజు మిగిలిన మ్యాచ్ లో అతను కామెంటరీ చేయడం లేదు. అతను త్వరలోనే మళ్లీ మైక్ పట్టుకుంటాడు అని చానల్ 7 ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ఇక పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ సైతం గుండెపోటుతోనే ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ కు సంబంధించి పాంటింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. వన్డే క్రికెట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్లోను అతను అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. అతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా మూడు వన్డే ప్రపంచ కప్ లు గెలుచుకుంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పాంటింగ్ ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా ఉంటున్నాడు.

READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్‌ పదవి ఔట్‌ ?

Related posts:

టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట… కోహ్లీ నుంచి షమీ వరకు ఎవరికి ఎంత జీతామో తెలుసా ? ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..! T 20 world cup: టీమిండియాకు ఏమైంది…కాపాడే వారు లేరా..? రోహిత్ పై అంపైర్ నితిన్ ప్రేమ.. కోహ్లీపై వివక్ష..!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd