Advertisement
సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చిన, తర్వాత మాత్రం కాస్త తడబడి ప్లాప్ లుగా నిలుస్తాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Advertisement
# ఆపద్బాంధవుడు:
మెగాస్టార్ చిరంజీవి, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందనే టాక్ వచ్చింది. సినిమా హిట్ అని అంతా అనుకునే సమయంలో వారం వారం సినిమా తగ్గిపోతూ చివరికి ఫ్లాప్ మూవీ గా నిలిచింది.
# మిత్రుడు:
2009లో రిలీజ్ అయిన మిత్రుడు సినిమాలో బాలకృష్ణ చాలా క్లాస్ గా కనిపించారు. అందులో ఆయన యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది. సినిమాకు మంచి రివ్యూ వచ్చింది. బాలయ్య కెరీర్ లోనే క్లాస్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా చివరికి ఫ్లాప్ అయింది.
# ఎదురులేని మనిషి:
2001లో విడుదలైన ఎదురులేని మనిషి మొదటి వారంలోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ వారం వారం కలెక్షన్లు తగ్గుతూ వచ్చి చివరికి ఫ్లాప్ గా అనిపించింది.
# అంటే సుందరానికి:
నాని మూవీ అంటే సుందరానికి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా విచిత్రంగా ఫెయిల్ అయిపోయింది. పెరిగిన టికెట్ ధరలు అప్పటికే వరుస పెట్టి సినిమాలు రావడంతో అంటే సుందరానికి మూవీ బిగ్ మైనస్ అయింది.
Advertisement
# శ్రీకారం:
శర్వానంద్ సినిమాకు చాలా రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆయన కూడా ఆనందించారు. సినిమా పరంగా టాక్ బాగున్న కలెక్షన్లు మాత్రం రాలేదు.
# జాను:
శర్వానంద్, సమంత జంటగా కలిసి నటించిన రీమిక్స్ సినిమా. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు దిల్ రాజుకు చాలామంది వద్దని చెప్పారు. కానీ ఆయన ఏమాత్రం వినకుండా రిస్క్ చేశాడు. దానికి తగ్గట్టుగా ఈ సినిమా మంచి టాక్ వచ్చిన డిజాస్టర్ గా మిగిలిపోయింది.
# వైల్డ్ డాగ్:
నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు ఆహీషోర్ సోలోమన్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ మంచి టాక్ వచ్చింది. కానీ వైరస్ కారణంగా ఈ సినిమాకి కలెక్షన్లు మాత్రం రాలేదు.
# ఉన్నది ఒకటే జిందగీ:
రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకేక్కించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. ఈ సినిమా చూడటానికి చాలా మంచిగా, ఆనందంగా అనిపించినా కానీ ఫలితం మాత్రం ఫ్లాప్.
# ఎటో వెళ్లిపోయింది మనసు:
నాని, సమంత జంటగా నటించిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు. కానీ ఆ టైం కి ఈ చిత్రం వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.
# మళ్లీ రావా:
సుమంత్, అక్షర సింగ్ జంటగా మూడేళ్ల కింద వచ్చిన సినిమా మళ్లీ రావా. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న కానీ ఫ్లాప్ గా నిలిచింది.