• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఆ కారణంగానే పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదు – చంద్రమోహన్

ఆ కారణంగానే పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదు – చంద్రమోహన్

Published on December 8, 2022 by anji

Advertisement

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న వారిలో చంద్రమోహన్ ఒకరు. ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966వ సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు చంద్రమోహన్. అప్పటినుండి ఇప్పటివరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 932 సినిమాలలో నటించారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు చంద్రమోహన్. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కూడా కలిసి నటించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఇండస్ట్రీకి, సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ గారు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

Read also: భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !

Advertisement

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. తన కూతుర్లను సినీ రంగానికి తీసుకురాకపోవడానికి అసలు కారణాలు ఏంటో ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు. “నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ చూడడానికి చక్కగా అందంగా ఉంటారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటుంది. చిన్నప్పుడు వాళ్లను చూసిన నటి భానుమతి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని చెప్పింది. వారిని చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేద్దామని నన్ను అడిగింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను.

నాకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదు. ఉదయం వారు లేవకముందే షూటింగ్ కి వెళ్లి పోయేవాడిని. నా భార్య పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ కి తీసుకువచ్చేది. వాళ్లు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. వాళ్లకి సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అడుగుతారని భయం వేసేది. సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నాం. ఇద్దరూ చదువుల్లో బాగా రానించారు. గోల్డ్ మెడలిస్టులు అయ్యారు. మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇక ఇప్పుడు వారికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది “అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.

Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు

Related posts:

చంద్రమోహన్ కూతురు కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్.. ఎవరంటే..? shakunthalam Movie ReviewShaakuntalam Telugu Review: సమంత “శాకుంతలం” రివ్యూ & రేటింగ్.. రామ్ పోతినేనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..? ram-potineniకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా హీరో రామ్ తన జోబులో రూపాయి కూడా పెట్టుకోరట ఎందుకంటే ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd