Advertisement
నల్గొండ జిల్లా పర్వేదుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధించాడని ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే పర్వేదుల గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే పక్క మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే యువతికి బ్రహ్మంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం చివరికి ఇద్దరి మధ్య ప్రేమగా మారడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది.
Advertisement
ఇక కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి మరి తొమ్మిది ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో వీరికి కాపురం సంతోషంగానే సాగుతుంది. ఈ క్రమంలోనే ఈ దంపతులు వీరి ఊర్లోనే ఓ చిన్న కిరాణా దుకాణాన్ని నడిపించారు. కొంత లాభ నష్టాలతో వీరి బిజినెస్ గా అలా కొన్ని రోజులు ముందుకు సాగింది.
Advertisement
కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ రోజులు గడిచే కొద్ది భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీనితో చాలా రోజుల నుంచి ఈ దంపతులు అంటిముట్టనట్టుగానే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల వీటన్నింటినీ భరించలేని ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ధనలక్ష్మి పురుగుల మందు తాగి ఆ…..త్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ధనలక్ష్మి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్త ప్రవర్తన కారణంగానే మా అమ్మాయి ఆ…త్య చేసుకుందని, ఆ మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
read also : కులాంతర వివాహాలు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు !