Advertisement
ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి అలా వేసుకుంటే ఏం జరుగుతుంది?అదృష్టమా? దురదృష్టమా?అనే విషయం మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఏం జరుగుతుందో ఓసారి మీరే చూడండి..? సాధారణంగా చెప్పులను పశువుల శరీరం నుంచి తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు కాబట్టి డాక్టర్లు చెప్పులు వేసుకుని ఇంట్లో నడవాలని సందేశం ఇస్తూ ఉంటారు. ఓకే అలాంటి సమస్య ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవచ్చు కానీ, వంటగదిలోకి కానీ,దేవుని గదిలోకి గాని అవి వేసుకొని అసలు వెళ్ళకూడదు.
Advertisement
ఇక వంట చేసేటప్పుడు మాత్రం అస్సలు చెప్పులు వేసుకుని చేయకూడదు. అలా చేస్తే మహా పాపం మన వెంటే ఉంటుంది. ఇంటికి ముందు గుమ్మానికి ఎదురుగా చెప్పులు వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కొందరైతే గుమ్మానికి పక్కనే చెప్పులు వదులుతూ ఉంటారు. ఇలా ముందు అయినా సరే పక్కన అయినా సరే చెప్పు వదిలితే అరిష్టమని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా గుమ్మం ముందు చెప్పులు వదిలేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
Advertisement
సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గుమ్మం ముందే తులసి కోట ను ఏర్పాటు చేసుకుంటారు. ఆ తులసికోటకు గుమ్మానికి మధ్య చెప్పులు ఉంటే తులసి కోట నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కాస్త చెప్పుల వల్ల ఆగిపోతుంది. అలాగే చెప్పులు ఎంత ఖరీదయినవి అయినా వాటిని కాళ్లకు వేసుకునే ఎక్కడెక్కడో తిరుగుతాం. అలా చెప్పులతో నెగిటివ్ ఎనర్జీ స్పష్టంగా వస్తుంది. దాన్ని అలాగే ఇంట్లోకి తీసుకు రాకుండా ఇంటికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది. ఇంట్లోకి చెప్పులు వేసుకోని తిరగడం వల్ల దరిద్రం అనేది వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఇంటికి దూరంగా చెప్పులను విడవడం చాలా మంచిది.
ALSO READ;
చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేసుక తప్పక స్నానం చేయాలట ..! లేకుంటే ..!