Advertisement
మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో పిల్లలు కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Advertisement
Also Read: మీనా భర్త విద్యాసాగర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..?
అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు అనే ప్రశ్నకు ఉపాసన ఈ విధంగా స్పందించారు. అది మా జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ పిల్లలు పెంపకం అనేది ఒక 20 ఏళ్ల ప్రాజెక్టు లాంటిది. ఒక విధంగా అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 20 ఏళ్లు అనేది చాలా ముఖ్యం. వారితో చాలా క్లోజ్ గా వెళుతూ ఉండాలి, అని ఉపాసన అన్నారు. పిల్లల జీవితాలకు పేరెంట్స్ తప్పనిసరిగా 20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాల్సి ఉంటుందని ఉపాసన పేర్కొన్నారు.
Advertisement
వాళ్లకు కావాల్సినవి సమకూర్చాలి. తప్పకుండా మేము వాటిని పుట్టబోయే పిల్లలకు అందించాలి అనే ఆలోచనతోనే ఉన్నాము. దాని కోసం కొంత నాలెడ్జ్ కూడా అవసరం. ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి. ఆ శుభతోరణం కోసం మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఉపాసన తెలిపారు. అలాగే పిల్లలను కనేందుకు మెంటల్ కాను, ఫిజికల్ గాను కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక 20 ఏళ్ల ఛాలెంజ్. ఎందుకంటే మళ్లీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎలా పెంచాను అనేది కూడా మీకు తెలియాలి. అది కూడా చాలా ముఖ్యమని ఉపాసన ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?