Advertisement
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలిచి చాలా తొందరగా అస్తమించారు. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్.
Advertisement
2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్ది సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. అయితే ఇతను చేయాల్సిన కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. అవి చేసి ఉంటే కనుక కచ్చితంగా మంచి కం బ్యాక్ ఇచ్చేవాడేమో అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
# స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం.రత్నం, ‘సూర్య మూవీస్’ బ్యానర్ పై ఉదయ్ కిరణ్ తో ‘ప్రేమంటే సులువు కాదురా’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాడు. 40% షూటింగ్ కూడా పూర్తయింది కానీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది.
# ‘ప్రత్యూష క్రియేషన్స్’ బ్యానర్ పై ఉదయ్ కిరణ్, అంకితలతో ఓ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది.
# ఇక ‘అంజన ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేశారు. అది కూడా ఆగిపోయింది.
Advertisement
# బాలకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల అనే సినిమాని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ ను అభిమాన్యుడి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఉదయ్ తో పాటు సౌందర్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
# ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్ లో ‘జబ్ వి మెట్’ ను తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్టు కూడా సెట్ అవ్వలేదు.
# ప్రఖ్యాత ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ వారు ‘లవర్స్’ అనే సినిమాని ఉదయ్ కిరణ్, సదాలతో రూపొందించాలని ప్లాన్ చేశారు కానీ ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది.
# ‘ఆదిశంకరాచార్య’ అనే సినిమా కూడా ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమా. నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
# ‘మనసంతా నువ్వే’, ‘నీ స్నేహం’ వంటి హిట్ సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ తో ఎంఎస్.రాజు ఓ సినిమా నిర్మించాలి అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది.
# విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కూడా ఉదయ్ కిరణ్ thow ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది.
# దర్శకుడు తేజ కూడా ఉదయ్ కిరణ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఓ సినిమా చేయాలి అనుకున్నారట. ఆయనే స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారట. కానీ అది కూడా మొదలు కాలేదు.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?